ఈ బ్యాంక్ లో మీకు ఖాతా ఉందా..? అయితే ఈ మార్పులు గమనించండి..!

-

కోటక్ మహింద్ర బ్యాంక్ లో మీకు ఖాతా వుందా..? అయితే మీకు ఈ విషయాలు తెలియాలి. తాజాగా
కోటక్ మహింద్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లలో కాస్త మార్పులు చేసింది. దీనికి సంబంధించి వివరాల లోకి వెళితే… 7 నుంచి 30 రోజుల గడువు తో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు 2.5 శాతం వడ్డీని అందించనుంది.

 

అదే కనుక 31 నుంచి 90 రోజుల ఎఫ్డీలైతే 2.75 శాతం వడ్డీ వస్తుంది. 91 నుంచి 179 రోజుల ఎఫ్డీపై 3.25, 180 రోజుల నుంచి ఏడాదిలోపు 4.40 శాతం వడ్డీ, సంవత్సరం నుండి 389 గడువు అయితే 4.50 శాతం, 390 రోజుల నుంచి 23 నెలల లోపు అయితే 4.90 శాతం మరియు 23 నెలల నుంచి మూడేళ్ల పరిమితి అయితే 5 శాతం, మూడేళ్ల పైగా నాలుగేళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల పై బ్యాంకు నుండి 5.10 శాతం వడ్డీ వస్తుంది.

ఇది ఇలా ఉండగా ఒకవేళ నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై అయితే 5.25 శాతం వడ్డీని అందించనుంది. అదే ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై అయితే 5.30 శాతం వడ్డీని కోటక్ మహేంద్ర బ్యాంక్ అందిస్తోంది. ఈ నెల 25 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి అని అన్నారు. అలానే సొంత ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీ తో హోమ్ లోన్లను అందిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news