ఆస్పత్రిలో చేరిన నటుడు అజిత్

-

తమిళ స్టార్ హీరో అజిత్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చెన్నైలోని అపోలో హాస్పిటల్​లో చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి తల ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగిందని ఆందోళన చెందుతున్నారు.  అజిత్​ అనారోగ్యం బారిన పడలేదని, సాధారణ చెకప్​ కోసమే హాస్పిటల్​కు వెళ్లారని, అయితే వైద్యులు చెక‌ప్‌లో కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండటంతో వైద్యుల సూచ‌న మేర‌కు అజిత్ ఆస్పత్రిలో జాయిన్ అయిన‌ట్లు సమాచారం. మ‌రో రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్​ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

అయితే అజిత్ అనారోగ్య స‌మ‌స్య‌ ఉందంటూ పొద్దున్న నుంచి జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు కొట్టిప‌డేశాయి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్టు అజిత్‌ కుమార్‌ పీఆర్వో సురేశ్‌ చంద్ర వివరణ ఇచ్చారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త కుదుట పడ్డారు. అజిత్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక అజిత్ త్వరలోనే  త‌న తర్వాతి సినిమా షూటింగ్ కోసం విదేశాల‌కు వెళ్లనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news