గ్యాంగ్ స్టార్‌గా మార‌నున్న త‌మిళ హీరో సూర్య‌!

త‌మిళ స్టార్ హీరో సూర్య జై భీమ్ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ప్ర‌స్తుతం సూర్య ఎత‌ర్‌క్కుమ్ తునింద‌వ‌న్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే త‌మిళ్ తో పాటు తెలుగు, హిందు తో స‌హా మొత్తం ఐదు భాషాల‌లో విడుద‌ల చేయ‌డానికి సిద్దం అవుతున్నారు. అయితే తాజా గా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. త‌మిళ స్టార్ ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర డైరెక్ట‌న్ లో ఈ సినిమా రాబోతుంద‌ని స‌మాచారం.

ఈ సినిమాలో సూర్య ను ప‌వ‌ర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ క‌నిపిస్తార‌ని తెలుస్తుంది. ఈ సినిమా క‌థ కు సంబంధించి చ‌ర్చ‌లు ఇప్ప‌టికే ముగిసాయని స‌మాచారం. సూర్య న‌టిస్తున్న ఈటీ సినిమా షూటింగ్ అయిన త‌ర్వాత ఈ సినిమా ప‌ట్టాలు ఎక్క‌నుంద‌ని తెలుస్తుంది. అయితే గ‌తంలో హీరో సూర్య, ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర కాంబో ఆకాశ‌మే నీ హ‌ద్దు రా అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమా సూర్య సినీ కేరీర్ లో ది బెస్ట్ మూవీగా గుర్తింపు వ‌చ్చింది. మ‌రో సారి ఈ హిట్ కాంబో క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ని స‌మాచారం. కాగ ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.