సీఎం కేసీఆర్‌ గారు మా చిత్ర పరిశ్రమకు వెసులుబాటు కల్పించండి : తమ్మారెడ్డి భరద్వాజ

-

కళామాతల్లి నీడలో జీవనం సాగిస్తున్న వందలమంది కార్మీకులు పనుల్లేక బిక్కు బిక్కు మంటున్నారు. చిత్ర పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమాకి పనిచేసే అసిస్టెంట్ బాయ్ దగ్గర్నుంచి దర్శక, నిర్మాత, హీరోల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. రిలీజ్ కి సిద్దంగా ఉన్న చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు అన్ని ఆగిపోయాయి. వందల కోట్ల వ్యాపార నష్ఠం వాటిల్లింది. చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

అయితే రాష్ట్ర ప్రభూత్వం ఈ నెల 6 వ తారీఖునుంచి కొన్ని కార్యకలాపాలు, కార్యక్రమాలు సాగించుకోవడానికి అనుమతినిచ్చింది. గృహ సంబంధిత, నిర్మాణలకి సంబంధించి, భూములు కొనుగోలు, అమ్మకాలు .. ఇత ఇతర కొన్ని పనులు యథా విధంగా చేసుకోవచ్చన్న అనుమతులు ఇచ్చారు ముఖ్యమంత్రి కె.సి.ఆర్. జోన్ల వారీగా కొన్ని పరిమితులలో పనులను చేసుకునే వెలుబాటును కల్పించారు. అలాగే పరీక్షలు నిర్వహించడానికి అన్ని సదుపాయాలను సమకూర్చనున్నారు.

దాంతో చిత్ర పరిశ్రమలోను కొన్ని కార్యక్రమాలను చేసుకునే వెసులు బాటు కల్పించాలని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. ఈ నేపథ్యంలో ఒక వీడియోను విడుదల చేశారు. చిత్ర పరిశ్రమలోని కార్మీకులను, దర్శక..నిర్మాతలను ఉద్దేశించి అందరి తరపున తమ్మారెడ్డి భరద్వాజా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారికి, కేటీఆర్ గారికి..అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తన అభ్యర్థన ను తెలిపారు. రాష్ట్రంలో చాలా మందికి వెసులు బాటు ఇచ్చినట్టుగానే మా సినీ రంగాని కి కూడా కొంత వెసులు బాటు ఇవ్వాలని.. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ముగ్గురురు వ్యక్తులతో పూర్తయ్యో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

దీనివల్ల కొంతమంది కార్మికులకైనా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఇక నిర్మాతలకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే సినిమా తొలి కాపీ వాళ్ల చేతుల్లో వుంటుందని అలాగే ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలకు అంటే ఎడిటింగ్, డబ్బింగ్..వంటి ఇన్ హౌజ్ వర్క్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వాలని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభ్యుర్థనను తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news