భయం, షాక్, ఆశ్చర్యం, విస్మయం.. లాంటి భావోద్వేగాలను తాప్సీ ఈ సినిమాలో చక్కగా ప్రదర్శించింది. అలాగే పలు ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.
అప్పుడెప్పుడో నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘మయూరి’ సినిమా గుర్తుంది కదా. అందులో నయనతార అద్భుతంగా నటించి అభిమానులను ఆకట్టుకుంది. అయితే అచ్చం అదే తరహాలో ఇప్పుడు వచ్చిన ‘గేమ్ ఓవర్’ చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుండగా.. ఈ సినిమాలో నటించిన తాప్సీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అత్యంత సహజ సిద్ధంగా తాప్సీ ఈ సినిమాలో నటించడంతో ఆమె అభిమానులు ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు.
సాధారణంగా హార్రర్, థ్రిల్లర్ జోనర్ అనే కాదు.. ఇతర ఏ జోనర్ అయినా సరే.. సినిమాలో ఆ జోనర్ తాలూకు సీన్లు ప్రేక్షకులను కట్టి పడేయాలి. అంటే.. ఆ సీన్లలో నటీనటులు జోనర్‌కు తగినట్లుగా నటించాలి. అప్పుడే ఆ సీన్లు పండుతాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇవాళ విడుదలైన గేమ్ ఓవర్‌లోనూ అలాంటి సీన్లే ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకనే మయూరి సినిమాలాగే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఇక గేమ్ ఓవర్ సినిమాలో తాప్సీ నటనకు సినీ విమర్శకులు కూడా బాగానే మార్కులేస్తున్నారు. హార్రర్, థ్రిల్లర్ జోనర్‌లో గేమ్ ఓవర్ సినిమా రావడంతో.. ఆ జోనర్ తాలూకు అంశాలు మనకు సినిమాలో పలు సీన్లలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భయం, షాక్, ఆశ్చర్యం, విస్మయం.. లాంటి భావోద్వేగాలను తాప్సీ ఈ సినిమాలో చక్కగా ప్రదర్శించింది. అలాగే పలు ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. ఈ క్రమంలో సినిమా చూసే ప్రేక్షకులకు నిజంగా తాము కూడా అందులోనే లీనమై ఉన్నామన్న థ్రిల్ కలుగుతుంది. ఇక ఇదే అంశంతో గేమ్ ఓవర్ మూవీ ఓవరాల్‌గా పాజిటివ్ టాక్‌ను సాధించింది. ఏది ఏమైనా.. ఈ తరహా సినిమాలు చేస్తే కచ్చితంగా ఏ నటి/నటుడికైనా చక్కని పేరు వస్తుంది. మరి తాప్సీ ముందు ముందు ఎలాంటి కథలను ఎంపిక చేసుకుని సినిమాల్లో నటిస్తుందో చూడాలి.!