విషమంగా మారిన తారకరత్న ఆరోగ్యం…!

-

తారకరత్న ఆరోగ్యం కుదుటపడుతోంది అని భావిస్తున్న సమయంలో మరొకసారి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఇప్పుడు వార్తలు బయటకు వచ్చాయి. విదేశాలనుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం తారకరత్నకు చికిత్స చేస్తోంది. కుప్పంలో గుండెపోటుకు గురైన వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసారు. ఆ సమయంలోనే తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్ లో అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు . 20 రోజులుగా అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు.

బెంగళూరు నారాయణ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత తారకరత్న క్రమేణా కోలుకుంటున్నట్లు కనిపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా తారకరత్నను పరామర్శించారు. నందమూరి బాలకృష్ణ తొలి రోజు నుంచి తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అంతేకాదు తారకరత్న ఆరోగ్యం కోసం అఖండ జ్యోతి వెలిగించి ప్రత్యేకంగా పూజలు కూడా చేయిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా బాగుండాలి అని, త్వరగా కోలుకుంటారని అందరూ అనుకున్నారు. మెదడుకు సంబంధించి నీరు ఉండడంతో చికిత్స చేస్తున్నారు. నీరు కారణంగా ఏర్పడిన వాపు తగ్గితేనే తిరిగి వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు క్షీణించినట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక హెల్త్ బుల్లెటిన్ కూడా వైద్యులు విడుదల చేయబోతున్నారు . ఈరోజు సాయంత్రానికి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు అందిస్తున్న చికిత్స తారకరత్న స్పందిస్తున్న తీరుపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ విషయం తెలిసి అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు, సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా చేరుకున్నారు. తారకరత్న సతీమణి, కుమార్తెలకు జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news