చాలా మంది పెద్ద పెద్ద సమస్యలని తేలికగా తీసేస్తూ ఉంటారు దానికి కారణం ఆ సమస్యని గుర్తుపట్టకపోవడం. నిజానికి మనకి ఏదైనా అనారోగ్య సమస్య రావడానికి ముందు పలు లక్షణాలు మనకి కనబడతాయి. ఆ లక్షణాలని కనుక మనం గమనిస్తే ఈజీగా సమస్యని అర్థం చేసుకుని దానికి చికిత్స తీసుకోవచ్చు. చాలామంది నోటి క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు అయితే నోటి క్యాన్సర్ ఈ మూడు లక్షల తో గుర్తించొచ్చు మరి ఇంక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూసేద్దాం.
నోటి క్యాన్సర్ ఎక్కడ వస్తుంది..?
నాలుక
పెదవులు
చిగుళ్ళు
బుగ్గ లోపలి పొర లో రావచ్చు
లేదంటే నోటి పైబాగం కింది భాగంలో అయినా రావచ్చు
లక్షణాలు:
నమలడం, మింగడం, మాట్లాడడం వంటివి చేస్తే ఇబ్బందిగా ఉంటుంది.
అలానే మంటగా, ఇబ్బందిగా ఉండచ్చు.
ఏదో గొంతులో ఆహారం ఉండిపోయినట్టుగా కూడా ఉండచ్చు.
దంత సమస్యలు:
నోటి క్యాన్సర్ ఉంటే దంత సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే సిగరెట్స్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నోటి శుభ్రత సరిగా ఉండదు. కనుక దంతాల సమస్యలు ఉంటాయి. ఒకవేళ మీరు దంతాల సమస్య తో బాధ పడుతున్నట్టయితే నోటి క్యాన్సర్ ఉందేమో చూడండి.
ఆహారం తీసుకునేటప్పుడు ఇబ్బంది:
నమలడం, మింగడం, మాట్లాడడం వంటివి చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. అలానే మంటగా, ఇబ్బందిగా ఉండచ్చు.
నోటి పుండ్లు:
క్యాన్సర్ వలన కూడా నోటి పుండ్లు వచ్చే అవకాశం వుంది. మెడిసిన్ తీసుకున్నా తగ్గకపోతే మాత్రం క్యాన్సర్ ఏ. ఈ పుండ్లు తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి.