లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఆపేయమని ఆర్జివికి ఫ్యాన్సీ ఆఫర్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చేసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోతుంది. సినిమా ఆపాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఆఫ్టర్ రిలీజ్ ఏదైనా ఉంటే చూసుకుందాం కాని ఇప్పుడు అడ్డుకోవడం వీల్లేదని రెస్పాన్స్ వచ్చింది. ఇదిలాఉంటే ఈసీ షాక్ ఇవ్వడంతో ఇక కోర్ట్ ద్వారా సినిమా రిలీజ్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు టిడిపి శ్రేణులు.

అంతేకాదు ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మొదలుపెట్టిన టైంలోనే ఆ సినిమా ఆపేయాలంటూ ఆయనకు బెదిరింపు కాల్స్ తో పాటుగా ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయట. సినిమా ఆపేస్తే 50 కోట్లు ఇస్తామని అన్నారట. ఈ విషయాన్ని నిర్మాత రాకేష్ చెప్పారు. అయితే డబ్బుకోసం వ్యక్తిత్వం అమ్ముకునే క్యారక్టర్ వర్మది కాదని అందుకే ఆ ఆఫర్ తిప్పికొట్టారని అన్నాడు.

వర్మ అప్పుల్లో ఉన్నాడని అందుకే 50 కోట్లకు కన్ విన్స్ అవుతాడని అనుకున్నారు కాని వర్మకు అంత పెద్ద ఖర్మ పట్టలేదని అన్నారు. మార్చి 22న రిలీజ్ అవుతున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.