హ్యాట్సాఫ్ తారక్, చరణ్.. వాళ్లు చేయలేనిది వీళ్లు చేసి చూపిస్తున్నారు..!

-

రికార్డులు.. రివార్డులు మాకొద్దు మీ అభిమానం చాలని చెప్పే ప్రతి హీరో.. అభిమానుల మధ్య సత్సంబందాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే.. మా మధ్య ఏం లేదు మేమంతా కలిసే ఉంటామని ఓ పక్క చెబుతూనే మరో పక్క మరోవిధంగా స్పందిస్తుంటారు.

రికార్డులు.. రివార్డులు మాకొద్దు మీ అభిమానం చాలని చెప్పే ప్రతి హీరో.. అభిమానుల మధ్య సత్సంబందాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే.. మా మధ్య ఏం లేదు మేమంతా కలిసే ఉంటామని ఓ పక్క చెబుతూనే మరో పక్క మరోవిధంగా స్పందిస్తుంటారు. ఒకప్పుడు ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు వీరంతా కూడా సూపర్ స్టార్స్ గా వెలుగు వెలిగిన వారే. వారు కూడా అప్పట్లో మంచి కాంబినేషన్స్ లో మల్టీస్టారర్ సినిమాలు చేశారు.

ఎన్.టి.ఆర్, ఏయన్నార్.. ఎన్.టి.ఆర్, కృష్ణ.. ఏయన్నార్, కృష్ణ.. కృష్ణ, శోభన్ బాబు ఇలా అందరు మల్టీస్టారర్స్ చేశారు. అయితే ఆ తర్వాత తరం హీరోలకు స్టార్ చట్రంలో ఇరుక్కుపోయి సోలో హీరోగా చేస్తూ వచ్చారు. ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబులు కూడా సోలో హీరోగా రాణిస్తూనే అభిమానుల ఉత్సాహం కోసం మంచి కథతో మల్టీస్టారర్ సినిమాలు చేశారు.

ఆ తర్వాత స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు మాత్రం ఒక్కటంటే ఒక్క మల్టీస్టారర్ సినిమా చేయలేదు. తమపై తమకున్న నమ్మకం కావొచ్చు అలా చేస్తే అభిమానులు చూస్తారా అన్న ఆలోచన కావొచ్చు. నిన్నటితరం స్టార్స్ అఫ్కోర్స్ ఇప్పటికి స్టార్స్ గా ఉన్న ఈ నలుగురు హీరోలు కలిసి నటించలేదు. వాళ్లు చేయలేదు ఇంక ఇప్పటి యువరక్తం చేస్తుందా అనుకునే వారు.

రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది.. ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.

కాని అంచనాలను తలకిందలు చేస్తూ మెగా, నందమూరి హీరోలు కలిసి మల్టీస్టారర్ షురూ చేశారు. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది.. ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికి మల్టీస్టారర్స్ వస్తున్నా ఓ సీనియర్ హీరో, ఓ జూనియర్ హీరో అన్న సమీకరణాలు ఉన్నాయి. కాని ఇద్దరు సమానమైన ఇమేజ్ కలిగిన రేసు గుర్రాలను కలిపి ఓ సినిమా చేస్తున్నాడు జక్కన్న.ఇది కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమైందని తెలుస్తున్నా.. బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పెరిగినట్టుగా ఆర్.ఆర్.ఆర్ తర్వాత స్టార్స్ మల్టీస్టారర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా చేయడానికి ఒక కారణం రాజమౌళి అయితే మరో కారణం తమ మధ్య ఉన్న స్నేహమని అన్నారు.

తారక్, చరణ్ కనిపించే ఆ సన్నివేశాలు వెండితెర ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సినిమాలు చేయడం వల్ల అటు ఫ్యాన్స్ మధ్య కూడా మంచి రిలేషన్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మెగా, నందమూరి మల్టీస్టారర్ గా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఒప్పుకున్నందుకు తారక్, చరణ్ లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news