నన్ను అడిగారు.. క్యాస్టింగ్ కౌచ్ గురించి బాంబ్ పేల్చిన తేజస్వి మదివాడ …!

-

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న మాట చెప్పడానికి ఒకప్పుడు చాలామంది భయపడే వారు. ఒకవేళ చెబితే సినిమాలలో అవకాశాలు రావేమో..ఎవరన్నా బెదిరింపులకు పాల్పడతారేమో ..ఇలా రక రకాల సందేహాలతో భయాలతో బాధను దిగ మింగుకొని మిన్నకుండేవారు. కాని కొంతకాలంగా ఈ విషయంలో నిర్మాతల నుంచి దర్శకుల నుంచి ఇతర టెక్నీషియన్స్ గురించి ధైర్యంగా ముందు కొచ్చి గుట్టు విప్పేస్తున్నారు. టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయన్న నమ్మకంతో కుండ బద్దలు కొట్టేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో తెలుగమ్మాయి తేజస్వి మదివాడ కూడా కాస్టింగ్ కౌచ్ లో తన అనుభవాలను బయట పెట్టింది. చిన్న చిన్న పాత్రలతో వెండితెర మీద సందడి చేసిన తేజశ్వి
ఆ తర్వాత వెంకటేష్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నితిన్ హార్ట్ ఎటాక్ వంటి సినిమాలలో మంచి పాత్రలు పోషించింది. ఇక సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.

ప్రస్తుతం కమిట్‌మెంట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన తేజశ్విని దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తను హీరోయిన్ గా ఎదగకపోవడానికి కారణం కాస్టింగ్ కౌచ్ అంటూ కుండ బద్దలు కొట్టేసింది. ఇండస్ట్రీలో ఎక్కువశాతం మంది ఇది అడుగుతారని బాంబ్ పేల్చింది. దీని వల్ల తన వ్యక్తి గత జీవితం కూడా దెబ్బ తినిందని ఈ సందర్భంగా బయట పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news