లాక్డౌన్ హ్యాంగోవర్ తీర్చడానికి తేజస్వి కమిట్మెంట్ తో వస్తుంది..

తేజస్వి మాదివాడ.. తెలుగు వెండితెర మీద చిన్న చిన్న పాత్రల ద్వారా పరిచయమై, ఆ తర్వాత హీరోయిన్ గానూ మెరిసింది. ఐతే హీరోయిన్ గా తేజస్వి సరైన విజయాన్ని అందుకోలేక పోయింది. సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే ఈ భామ, తాజాగా ఓ ప్రకటన చేసింది. కమిట్మెంట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజస్వి, ఆ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. అన్ లాక్ దశలో ఉన్నప్పటికీ లాక్డౌన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా.. అంటూ ఈ టైమ్ లో కొత్త ఎనర్జీని పుట్టించడానికి కమిట్మెంట్ టీజర్ వచ్చేస్తోందని తెలిపింది.

నవంబర్ 18వ తేదీన లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన కెమిట్మెంట్ టీజర్ బయటకి రానుంది. సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్లు ఎలా ఉంటాయన్న విషయమై చూపించబోతున్న ఈ సినిమాలో తేజస్వి చాలా గ్లామరస్ గా కనిపించనుంది. తేజస్వితో పాటు రమ్య పసుపులేటి, ఇంకా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. మరి కమిట్మెంట్ తో అయినా తేజస్వి హిట్ కొడుతుందేమో చూడాలి.