కల్కి మూవీకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..

-

కల్కి మూవీకి రేవంత్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కల్కి మూవీ స్పెషల్ షో లకు, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Telangana government good news for Kalki movie

తాజాగా ‘కల్కి’ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజైంది. రిలీజ్ ట్రైలర్ పేరుతో మేకర్స్ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. విజువల్స్, బీజీఎం అదిరిపోయాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్తో పాటు కొత్త వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. ‘కల్కి’ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇలాంటి తరుణంలోనే.. కల్కి మూవీ స్పెషల్ షో లకు, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 • టికెట్ల ధరలు
 • బెనిఫిట్ షోల రేట్లు
  సింగిల్ స్క్రీన్ థియేటర్లు – 377/-
  మల్టీప్లెక్స్ – 495/-
 • రెగ్యులర్ షోల రేట్లు
  సింగిల్ స్క్రీన్ థియేటర్ – 265/-
  మల్టీప్లెక్స్ – 413/-

Read more RELATED
Recommended to you

Latest news