టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్న తెలంగాణ హీరోలు..

-

టాలీవుడ్ పురుడుపోసుకుని ఎనిమిది ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా.. ఈ సినీ ఇండస్ట్రీలో తెలంగాణ హీరోలు, డైరెక్ట‌ర్లు చాలా త‌క్కువ‌. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోంది. వ‌రుస‌గా తెలంగాణ హీరోలు, డైరెక్ట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే హీరో నితిన్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట్రీ ఇచ్చి ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.స

 

వీరితో పాటు మొన్న వ‌చ్చిన జాతిర‌త్నాలు సినిమా డైరెక్ట‌ర్‌, హీరో ఇద్ద‌రూ తెలంగాణ వాల్లే. ఇక పెళ్లి చూపులు సినిమాను డైరెక్ట్ చేసిన త‌రుణ్ భాస్క‌ర్‌కూడా ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు.

ఇక ప‌లువురు ఆర్టిస్టులు, క‌మెడియ‌న్లు కూడా టాలీవుడ్ లో త‌మ స‌త్తా చూపెడుతున్నారు. ప్రియ‌ద‌ర్శి, రామ‌కృష్ణ‌లాటి క‌మెడియ‌న్లు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. అయినా ఇది చాలా త‌క్కువే. ఇంకా చాలామంది వచ్చిన‌ప్పుడే ప్రాంతీయ బేధాలు తొల‌గిపోతాయి. మ‌రి ముందు ముందు మ‌రింత మంది తెలంగాణ క‌ళాకారులు స‌త్తా చాటాల‌ని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news