ఇండియా వరల్డ్ కప్ సాధిస్తే విశాఖపట్నం బీచ్ లో బట్టలు విప్పి పరిగెడతానని తెలుగు నటి రేఖ బోజ్ సంచలన వాక్యాలు చేశారు. టీమిండియా ప్రభంజనం సృష్టించింది. న్యూజిలాండ్ పై సెమీస్ లో గెలిచిన భారత్….వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో నవంబర్ 15న జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో భారత్ 70 పరుగులు తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆ తర్వాత న్యూజిలాండ్ ను 48.5 ఓవర్లలో 327 పరుగులకే భారత బౌలర్లు ఆల్ అవుట్ చేశారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పై 2019 పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ తరుణంలోనే.. ఇండియా వరల్డ్ కప్ సాధిస్తే విశాఖపట్నం బీచ్ లో బట్టలు విప్పి పరిగెడతానని తెలుగు నటి రేఖ బోజ్ సంచలన వాక్యాలు చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది ఒక పబ్లిసిటీ స్టంట్’…. ‘మరో పూనమ్ పాండే’… ‘ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం’…. ‘ఇప్పుడే వైజాగ్ కు టికెట్ బుక్ చేసుకుంటున్నా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేఖా ‘దామిని విల్లా’, ‘మాంగళ్య ‘కాత్యాయని’ సినిమాలో నటించారు.