మీకేమైనా పిచ్చా… ఆ సినిమాను రీమేక్ చేయడం ఏంటి?

ఒకవేళ ఈ సినిమా తెరకెక్కితే.. తమిళంలో రిలీజ్ అయితే.. హిట్టవుతుంతా? లేక ఫట్టవుతుందా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

మహేశ్ బాబు కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ ఏది అని అడిగితే టక్కున చెప్పేయొచ్చు.. ఏ సినిమా చెప్పండి… ఇంకేముంది… బ్రహ్మోత్సవం. ఆ సినిమా అట్టర్ ప్లాఫ్. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి.. ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. షాక్ అయ్యారా? అవును.. ఆ సినిమా డిజాస్టర్ అని తెలిసి కూడా తమిళంలో రీమేక్ చేయబోతున్నారు.

Telugu disaster brahmotsavam to remake in tamil

తమిళంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ గా ఫేమస్ అయిన చేరన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. ఇటీవలే ఈ సినిమాను చేరన్ చూశాడట. సినిమా ఆయనకు పిచ్చపిచ్చగా నచ్చిందట. తమిళ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడట. దీంతో ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. కాకపోతే అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను మలచాలని చూస్తున్నాడట చేరన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని తెలిపాడు. అయితే.. కొంతమంది సినీ విశ్లేషకులు మాత్రం డిజాస్టర్ ను తెరకెక్కించడం ఏంటి.. ఆ సినిమాను మళ్లీ రీమేక్ చేసేవాళ్లకు పిచ్చి పట్టిందా ఏంటి.. అని కామెంట్లు చేస్తున్నారు.

ఒకవేళ ఈ సినిమా తెరకెక్కితే.. తమిళంలో రిలీజ్ అయితే.. హిట్టవుతుంతా? లేక ఫట్టవుతుందా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.