మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో ప్రతి ఏడాది టాప్ లో నిలిచే బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు ఈసారి స్థానం దక్కకపోవడం గమనార్హం. కానీ హృతిక్, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్‌కి ఇందులో స్థానం దక్కింది.
ది టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్స్ లో తెలుగు హీరోలు సత్తా చాటారు. ‘టైమ్స్ మోస్ట్ ఫరెవర్ డిజైరబుల్ క్లబ్’లో మహేష్‌బాబు చోటు సంపాదించారు. ఇందులో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. దీంతోపాటు ‘ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాలో తెలుగు నుంచి యువసంచలనం విజయ్ దేవరకొండ, ప్రభాస్, రానాలు కూడా చోటు దక్కించుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ నాల్గవ ర్యాంక్‌ని, ప్రభాస్ 12వ ర్యాంక్, రానా 19వ ర్యాంక్‌ని సంపాదించారు.
ఇదిలా ఉంటే, ఈ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో ప్రతి ఏడాది టాప్ లో నిలిచే బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు ఈసారి స్థానం దక్కకపోవడం గమనార్హం. కానీ హృతిక్, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్‌కి ఇందులో స్థానం దక్కింది.
అయితే ఈ జాబితాలో గతంలో మాదిరి సీనియర్లని కాకుండా కొత్తవారిని, యువ నటులనే మాత్రమే ఎంపిక చేశారట. అందుకోసం ప్రత్యేక లిస్ట్ ని తీసుకొచ్చారు. అందులో భాగంగా 2019కి చెందిన జాబితాలో మహేష్ తోపాటు ప్రభాస్, విజయ్ దేవరకొండ, రానా నిలిచి బాలీవుడ్ అగ్ర హీరోలకు షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే విజయ్ తెలుగు హీరోలకు కూడా షాక్ ఇచ్చారని చెప్పాలి. బాహుబలితో దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాస్, రానాలని కూడా విజయ్ వెనక్కి నెట్టడం విశేషం.
విజయ్‌కి దరిదాపుల్లో కూడా ప్రభాస్, రానాలు లేరు. దీంతో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది. సరికొత్త మ్యానరిజమ్, డైలాగ్ డెలివరీ, తెలంగాణ యాసలో మాట్లాడటం వంటి వన్నీ తెలుగు ఆడియెన్స్ కి కొత్తగా, ఓ ఫ్రెష్ ఫీలింగ్‌నిచ్చాయి. అందుకే ఆడియెన్స్ ఆయన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. విజయ్ సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌లో ఓ సరికొత్త సునామిలా వచ్చిన విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌లో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ఆయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.
అలాగే ఆనంద్ అన్నమలై డైరెక్షన్‌లో హీరో సినిమాలో నటించనున్నారు. క్రీడా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపిస్తారట. ఇది ఈనెల 20న ప్రారంభం కానుంది. ఇక ఇటీవల మహర్షి తో మహేష్‌బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంటున్నప్పటికీ మంచి కలెక్షన్లని వసూలు చేస్తోంది. త్వరలో ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రం చేయనున్నారు. ప్రభాస్ సాహోతో రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తున్నారు. రానా ప్రస్తుతం ‘1945’, ‘హిరణ్యకశ్యప’, ‘హాథి మేరీ సాథి’, ‘విరాటపర్వం’, ‘హౌస్‌ఫుల్ 4స వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.