మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. కొన్నేళ్ల క్రితం దాదాపుగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుని దూసుకెళ్లిన మణిశర్మ, ఇటీవల మాత్రం చాలా వరకు సినిమాలు తగ్గించారు. అయితే థమన్, దేవిశ్రీ వంటి వారి రాకతో మణిశర్మ హవా కూడా కొంత తగ్గిందనే చెప్పాలి. ఇక ఆ తరువాత నుండి వారిద్దరూ కూడా దూసుకెళ్లారు. అయితే మళ్ళి కొన్నేళ్ల విరామం తరువాత నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చి,
ఆ సినిమాకు మంచి మ్యూజిక్ అందించారు మణిశర్మ. ఇక ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో రామ్ ల కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ, మళ్ళీ అందరి దృష్టిని తనవైపుకు త్రిప్పుకునేలా చేశారు. ఇక ఆ తరువాత కొందరు దర్శక నిర్మాతల చూపు కూడా మణిశర్మ వైపుకు మళ్లింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ 152వ సినిమా, వెంకటేష్ నారప్ప, గోపీచంద్ సంపత్ నంది సినిమా, విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల సినిమాలు మణిశర్మ ఖాతాలోకి వచ్చాయి.
ఇక వీటికి అద్భుతమైన మ్యూజిక్ అందించి మళ్ళి సూపర్ ఫామ్ లోకి రావాలని చూస్తున్న ఆయన దెబ్బకు థమన్, దేవిశ్రీ గుండెల్లో గుబులు మొదలైనట్లు చెప్తున్నారు. తన మ్యూజిక్ డైరెక్షన్ లో థమన్ వంటి యువ సంగీత దర్శకులు ఎందరికో అవకాశాలు ఇచ్చిన మణిశర్మ, నేడు వారిపైనే పోటీకి దిగుతున్నారంటే ఒకింత పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు యువ మ్యూజిక్ డైరెక్టర్స్ దూసుకెళ్తున్న ఈ తరుణంలో మణిశర్మ తనకు వచ్చిన అవకాశాలను ఎంతవరకు సద్వినియోగం చేసుకుని ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి….!!