ఇన్నేళ్లు మా బంధాన్ని దాచడానికి కారణం అదే – వరుణ్ తేజ్..!

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎట్టకేలకు త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడిపిన వరుణ్ తేజ్ మొన్నటి వరకు కూడా తమ ప్రేమ బంధాన్ని ఎక్కడ రివీల్ చేయలేదు. అంతేకాదు వీరిద్దరి బంధం గురించి ఎన్నో రకాల రూమర్స్ వినిపించినప్పటికీ వీరు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అడిగితే మంచి స్నేహితులం మాత్రమే అంటూ కొన్ని సందర్భాలలో తెలిపిన విషయం తెలిసిందే.

కానీ గత కొన్ని రోజుల క్రితం ఉన్నట్టుండి నిశ్చితార్థం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ ఏడాది చివర్లో వివాహం కూడా చేసుకోబోతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు తమ ప్రేమ, పెళ్లి గురించి బయట చెప్పని వరుణ్ తేజ్.. తాజాగా మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. నాకు లావణ్యకు మధ్య ఆరు సంవత్సరాల స్నేహబంధం ఉంది. ఆ స్నేహ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని తలచి ఇంట్లో చెప్పే ప్రయత్నం చేసాము.మా మీద ఉన్న నమ్మకంతో.. అటు లావణ్య ఇంట్లో ఇటు మా ఇంట్లో ఎవరు కూడా మా ప్రేమకు అడ్డు చెప్పలేదు.

అయితే ఇన్ని రోజులు మేము మా ప్రేమను బయట పెట్టకపోవడానికి కారణం సోషల్ మీడియా అనే చెప్పాలి. ఎందుకంటే మా రిలేషన్షిప్ పై చర్చ మొదలైనప్పుడు అది మా బంధం లో ఎక్కడైనా.. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ను క్రియేట్ చేస్తుందేమో అన్న భయం.. మాకు కూడా ఎక్కడికైనా వెళ్లాలి డిన్నర్ చేయాలని చాలా అనిపించేది.. కానీ ఈ కారణం వల్లే మా బంధాన్ని రహస్యంగా ఉంచాము. ఈ ఐదు ఆరు సంవత్సరాలలో ఎన్నో బహుమతులు ఇచ్చుకున్నాము. కానీ అందులో ప్రత్యేకం అంటూ ఏమీ లేవు. అయితే ప్రస్తుతం నేను వాడుతున్న ఫోన్ కూడా తాను ఇచ్చిందే. నేను కూడా ఎన్నో బహుమతులు ఇచ్చాను.. అంటూ తమ బంధం గురించి వెల్లడించారు వరుణ్ తేజ్.

Read more RELATED
Recommended to you

Latest news