ప్రపంచాన్ని జయించే శక్తి భారత యువతలోనే ఉందని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం అమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాక పోటీ తత్వం పెరిగిందని అన్నారు చంద్రబాబు. ఇంజనీరింగ్ కళాశాలలు పెడితే తనను ఎగతాళి చేశారని గుర్తు చేశారు.
ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రస్తుతం విదేశాలలో స్థిరపడిపోయారని పేర్కొన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని.. ప్రపంచాన్నే జయించే శక్తి భారత యువతలో ఉందని ప్రశంసించారు. గురువారం రాత్రి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం చేరుకున్న చంద్రబాబు నల్ల వంతెన సమీపంలోని సత్యనారాయణ గార్డెన్స్ లో రాత్రి అక్కడే బస చేశారు. ఇక శుక్రవారం అమలాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.