తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంతకుమించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు జగపతిబాబు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి 35 సంవత్సరాలు అవుతోంది. ప్రముఖ నిర్మాత విబి రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలా ఇండస్ట్రీలో సాధించిన సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువగా వెంటాడాయి. అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి తన రేంజ్ మార్చుకున్నారు జగపతిబాబు.
ప్రస్తుతం విలన్ గా వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు ఎన్నో విషయాలను మీడియాతో పంచుకోవడం జరిగింది.. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చి 34 సంవత్సరాలు పూర్తయింది. అయితే అందరిలాగా సినిమాలు మాత్రమే కాకుండా నాకు ఇతర బిజినెస్ లు చేయడం నలుగురిలో కలవడం పెద్దగా తెలియదు.. నాకు మాట్లాడటం కూడా అంతగా రాదు.. నాకు సినిమా తప్ప మరేమీ తెలియదు..
అందరిలాగా నేను ఇప్పుడు కమర్షియల్ గా ఆలోచించి కమర్షియల్ గా బిహేవ్ చేయలేను.. బహుశా అందుకే నేను వెనుక పడ్డానేమో.. ఇక ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్ లకు కూడా వెళ్లడం మానేశాను. ఎందుకంటే సినిమా ఫంక్షన్లలో వేదికపై అందరిని పొగిడి పొగిడి అలసిపోయాను.. వేదికపై అందరిని తోసుకుంటూ వెళ్లి ముందు నుంచోనే అవసరం నాకు లేదు.. అందుకే సినిమా ఫంక్షన్లకు వెళ్లడం మానేశాను అంటూ జగపతిబాబు క్లారిటీ ఇచ్చారు.