అందుకే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నారా..?

-

తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం #SSMB 29. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇది. ఈ సినిమా ఎలా ఉంటుందా.. అంటూ ప్రతి ఒక్కరు కూడా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి రాజమౌళి గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అంతకుమించి అనేట్టుగా ఉండే విధంగా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్కార్ టార్గెట్ గా మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేస్తున్నారు అన్న వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.

రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమా కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిందని సమాచారం. ఇప్పటికే రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఒక అద్భుతమైన కథను తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ స్టోరీ ఇప్పటివరకు ఇండియన్స్ అనే చరిత్రలో ఏ ఒక్కరు కూడా ముట్టుకోలేదట. ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ లోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలోనే విభిన్నమైన సినిమాగా ఉండబోతుందని విజయేంద్ర వర్మ వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆస్కార్ అవార్డు టార్గెట్ గా మహేష్ బాబుతో ఈ సినిమా తెరకెక్కించడానికి రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ సమ్మర్ నుండి మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళితో సినిమాను చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news