మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ఒకవేళ విశాఖని రాజధానిగా కాకుండా..మళ్ళీ అమరావతిని రాజధానిగా చేయాలంటే..ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సెపరేట్ రాష్ట్రంగా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. అయితే ఇటీవల ఈ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ శ్రీకాకుళం సభలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడితే..ప్రజలే తరిమికొడతారని అన్నారు. అలాగే చాలా ఏళ్ళు నుంచి ధర్మాన మంత్రిగా చేస్తున్నారు…మరి వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు.
అలాగే ధర్మాన, వైసీపీ నేతలు భూ కబ్జాలు చేసి ఉత్తరాంధ్రని దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇక పవన్ వ్యాఖ్యలపై ధర్మాన కౌంటర్లు ఇచ్చారు. ప్రజల పన్నులన్నీ తీసుకువెళ్లి అమరావతి అభివృద్ధి చేస్తామంటే ఈ ప్రాంత వ్యక్తిగా తాను అంగీకరించనని, చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ అమరావతిలోనే పెట్టుబడి పెడతారన్నారు.
అమరావతి పేరుతో జరుగుతున్న రియల్‌ఎస్టేట్‌ను పవన్ సమర్థిస్తున్నారని, పవన్ కల్యాణ్‌కు ఒక స్టాండ్ లేదని, తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారో పవన్ ఆలోచించాలని ధర్మాన అన్నారు. ఇక తాను సైనికుల భూములు కబ్జా చేశానంటున్నారని.. తాను భూమి కబ్జా చేశానని ఏ సైనికుడైనా చెప్పారా? అని ధర్మాన ప్రశ్నించారు. ఇలా తనదైన శైలిలో ధర్మాన పవన్‌పై విరుచుకుపడ్డారు.
అయితే బాబు వస్తే మళ్ళీ అమరావతిలోనే అన్నీ పెడతారని ధర్మాన అంటున్నారు…కానీ ఎప్పుడు కూడా బాబు ఆ స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూనే..విశాఖని ఐటీ, వ్యాపార రాజధానిగా అభివృద్ధి చేస్తానని, అటు రాయలసీమని సైతం అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెబుతున్నారని, అంటే అన్నీ ప్రాంతాల అభివృద్ధి పాలసీతో బాబు వెళుతుంటే..వైసీపీ వాళ్ళు మాత్రం మూడు రాజధానుల పేరుతో..మూడు ప్రాంతాలఅని అభివృద్ధి చేయకుండా, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీడీపీ-జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.