ఆయన మాటే ఫైనల్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కుర్ర హీరోయిన్..!!

-

సాధారణంగా సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత దర్శకులు ఎలా చెబితే నటీనటులు అలా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది దర్శకులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ సినిమా నుంచి వెళ్లిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల దర్శకుడి మాటే ఫైనల్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కుర్ర హీరోయిన్ తనిష్క్ రాజన్. రంగస్థలం నటిగా భారతదేశ వ్యాప్తంగా ఎన్నో నాటకాలలో వేషం కట్టిన ఈమె 12 ఏళ్ల వయసులోనే తన సోదరితో ముంబై వెళ్లి వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టింది. ఈ ముద్దుగుమ్మ టీవీ రంగంలో ప్రకటనలు చేసే స్థాయి నుంచి సౌత్ ఇండియన్ సినిమాలలో నటించే స్థాయికి ఎదిగింది. అలా 2017 లో శరణం గచ్చామి అనే సినిమాలో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత దేశంలో దొంగలు పడ్డారు.. ఇష్టంగా.. బైలంపూడి.. కమిట్మెంట్ అనే సినిమాలలో ఆఫర్లు వచ్చాయి . ప్రస్తుతం నేనెవరో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఆమె చేతిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అంతేకాదు హిందీలో సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా ఈమె నటించినా దోలోగ్ అనే ప్రైవేట్ ఆల్బమ్ యూట్యూబ్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంచి కథలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈమె ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం అంత సులభం కాదు అంటూ తెలిపింది.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీడియాతో మాట్లాడుతూ..” డైరెక్టర్ ఏం చెబితే నేను అదే చేస్తాను.. ఆయన విజన్ కు తగ్గట్టుగా నటించడానికి ప్రయత్నిస్తాను.. దర్శకుడి మాటే వేదవాక్కు .. ఆయన మాటే ఫైనల్ ” అంటూ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే కష్టపడి పనిచేయాలని అనుకుంటుంది తనిష్క్ రాజన్.. ఏది ఏమైనా కష్టపడే తత్వం కలిగిన ఈమె లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news