మేఘాలయలోని షిల్లాంగ్ లో హనీమూన్ కు వెళ్లిన నూతన దంపతుల అదృశ్యం, కొద్దిరోజులకే భర్తను భార్య హత్య చేయించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సోనమ్ తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించిన ఘటనను సినిమా తీయనున్నట్లు వార్తలొచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఎస్పీ నింబావత్ దీన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల్ని కలిసి అనుమతి కోరగా.. అందుకు వారు అంగీకరించినట్లు నింబావత్ తెలిపారు. హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు.
తన సోదరుడి హత్యోదంతంపై సినిమా తీయనుండటంపై రఘువంశీ సోదరుడు సచిన్ స్పందించారు. తమ సోదరుడి ఉదంతాన్ని వెండితెరపైకి తీసుకువస్తేనే.. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో ప్రజలకు
కూడా తెలుస్తుందన్న నమ్మకంతోనే సినిమా తీసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇక సినిమా
స్క్రిప్ట్ పసులు పూర్తయ్యాయని, 80 శాతం షూటింగ్ ఇండౌర్లో, 20 శాతం షూటింగ్ మేఘాలయలో
తీయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.