నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

-

నాగార్జున సాగ‌ర్ నిండు కుండ‌లా మార‌డంతో.. ఆ ప్రాజెక్టు 26 క్ర‌స్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. అయితే జులై నెల‌లోనే 26 క్ర‌స్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేయ‌డం 18 ఏండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. ఇక సాగ‌ర్ గేట్లు ఎత్త‌డంతో.. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, ప‌ర్యాట‌కులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఆ దృశ్యాల‌ను ప‌ర్యాట‌కులు త‌మ కెమెరాల్లో బంధిస్తూ, మ‌రోవైపు ఫొటోల‌కు ఫోజులిస్తూ ఎంజాయ్ చేశారు.

0

మొత్తం 26 గేట్లలో 16 గేట్లు 5 అడుగుల మేరకు ఎత్తడం… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తు వరకు ఎత్తి దిగువకు నీటిని పంపిస్తున్నారు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీ వరద రావడంతో 8 గేట్లను వదిలారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి నిన్న తొలుత 2 గేట్లు ఎత్తి మంత్రి ప్రారంభించారు. ఆ తరువాత ఒక్కోగేట్ ఎత్తి 26 గేట్ల వరకు ఎత్తారు.  దీంతో 3,13,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. నాగార్జున సాగర్ నీటి నిలువ సామర్థ్యం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగుల ఎత్తు వరకు నీళ్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news