ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం 2016 మే 1న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది సామాజిక సంక్షేమ పథకం దేశంలోనే దారిద్రరేఖ దిగువున ఉన్న కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లోని స్త్రీలకు, గ్యాస్ కనెక్షన్ అందించడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఎంతమంది లబ్ధి పొందారు అనేది ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎక్కువ సంఖ్యలో మహిళలకు కనెక్షన్లు అందించబడ్డాయి. సుమారు 12 లక్షల మంది మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు సమాచారం. ఈ పథకం కింద 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు దిగువ మధ్యతరగతి కి చెందిన మహిళలకు, గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన వారికి అందించడం జరిగింది . ఇంట్లో ఇప్పటికే ఒక ఎల్పిజి కనెక్షన్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. ఒక్కో కనెక్షను 1600 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబడుతుంది. ఇందులో సిలిండర్ డిపాజిట్, ఉచిత గ్యాస్ స్టవ్ అందించడం జరిగింది.
ఈ పథకం ద్వారా తెలంగాణలోని గ్రామీణ మహిళలు లబ్ధి పొందడం జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన తెలంగాణలో గ్రామీణ మహిళల జీవన పరిమాణాలు మెరుగుపరచడంలో సహాయపడింది.గ్రామీణ ప్రాంతం లోని ప్రజలు కట్టెలు,బొగ్గులు,వంటివి ఉపయోగించి వంట చేసుకునేవారు.అలంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడింది.గృహ కాలుష్యాన్ని తగ్గించడంలోఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల కలెక్షన్లు అందించబడ్డాయి. తెలంగాణలో 12 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఇప్పటికే ఈ స్కీం కింద రాయితీని రూ.300 అందించడం జరుగుతుంది. కొత్తగా ఉజ్వల్ స్కీం కింద కొత్త కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంకు దరఖాస్తులను మహిళలు దగ్గరలో ఉన్న ఎల్పిజి కేంద్రాలకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు.