‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్‌కు అస్వస్థత

-

‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయణ్ను ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విరామం లేకుండా వరుస ప్రయాణాల కారణంగా అనారోగ్యం బారిన పడ్డట్లు తెలుస్తోంది.

మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై దర్శకుడు స్పందించారు. డీహైడ్రెషన్‌ , ఇన్ఫెక్షన్‌ సమస్యలతో కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని అన్నారు. డిశ్చార్జ్ చేయమని వైద్యులను కోరనున్నట్లు సుదీప్తో సేన్‌ తెలిపారు.

విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేగిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అదా శర్మ హీరోయిన్‌గా నటించింది. హిజాబ్‌, లవ్‌ జిహాద్‌ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్‌ జిహాద్‌ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే ఆరోపణలపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంపై కేరళ సహా పలు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఈ వివాదాస్పద చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news