పార్లమెంట్ ప్రారంభం రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకం – ఎంపీ ఉత్తమ్

-

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రేపటి పార్లమెంటు ప్రారంభం రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకంగా ఉండడంతో బాయికాట్ చేస్తున్నామన్నారు.

“నౌ సాల్.. నౌ సవాల్” అంటూ బిజెపి వైఫల్యాలను ప్రతి రాష్ట్రంలో తెలుపుతున్నామని అన్నారు. పార్లమెంటులో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పనిది మోడీయేనని.. ఏ చట్టాలు చేసినా ఎటువంటి చర్చ లేకుండా పాస్ చేసింది ఆయనేనని విమర్శించారు. స్వతంత్రం తరువాత అతి తక్కువ పార్లమెంటు పని దినాలు ప్రధాని మోదీ వచ్చాకే జరుగుతున్నాయని ఆరోపించారు. మోడీ ప్రధాని అయ్యాక వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news