ఓరుగల్లు కారులో కొత్త అభ్యర్ధులు..కేసీఆర్ నయా స్కెచ్.!

-

ఓరుగల్లు: పోరాటాల పురిటిగడ్డ …తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిన ఓరుగల్లు రాజకీయాలు ఇప్పుడు వాడివేడిగా సాగుతున్నాయి. గత రెండు ఎన్నికలుగా కేసీఆర్‌కు అండగా ఉంటూ వస్తున్న వరంగల్ జిల్లాలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అనూహ్యంగా బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడంతో సీన్ మారుతుంది. ఇక్కడి ప్రజలకు కే‌సి‌ఆర్ ప్రభుత్వం పట్ల పాజిటివ్ అభిప్రాయం ఉంది గాని..ఎమ్మెల్యేల పట్ల కాస్త నెగిటివ్ ఉంది.

ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉంటే..గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 10 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంది. ఇక అందులో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క మినహా,…మిగిలిన వారంతా బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 5 మందిపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కొన్ని అవినీతి ఆరోపణలు..కొందరు ఎమ్మెల్యేలతో ద్వితీయ శ్రేణి నేతలకు పడకపోవడం, పార్టీలో ఆధిపత్య పోరు జరగడం లాంటి అంశాల వల్ల కొంతమంది ఎమ్మెల్యేలకు నెగిటివ్ ఉందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిందని సమాచారం.

అయితే కే‌సి‌ఆర్ ప్రభుత్వం పట్ల ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారు. ఈ క్రమంలో కే‌సి‌ఆర్..కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడానికే చూస్తున్నారని తెలుస్తుంది. మామూలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు అని ప్రకటించారు. కానీ ప్రజా వ్యతిరేకత ఉన్నవారికి సీట్లు డౌటే అని చెప్పవచ్చు. ఇప్పుడు ఓరుగల్లులో ఆ దిశగానే కే‌సి‌ఆర్ ముందుకెళ్తున్నారట. ఖచ్చితంగా నలుగురైదుగురు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమని సమాచారం వస్తుంది.

మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఓరుగల్లులో ఆధిక్యం సాధించాలనే కే‌సి‌ఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. కాకపోతే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పెట్టుకుని ముందుకెళితే ఆధిక్యం కష్టం..అందుకే వారిని సైడ్ చేసి బలమైన అభ్యర్ధులని రంగంలోకి దింపడానికి రెడీ అవుతున్నారు. చూడాలి మరి ఓరుగల్లులో బి‌ఆర్‌ఎస్ ఎలా సత్తా చాటుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news