ఈరోజుల్లో చాలా మంది ఫిట్‌గా ఉండాలని.. ఏవేవో డైట్‌లు పాటిస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్ మానేయడం, ఉప్పు తగ్గించడం ఇలా చాలా చేస్తుంటారు. ఏదైనా సరే.. అతిగా చేస్తే అది ప్రమాదాలకే దారితీస్తుంది. ప్రముఖ నటి శ్రీదేవి హాఠాన్మరణం గురించి మనందరికి తెలుసు. ఆమెన కచ్చితంగా హత్య చేసి ఉంటారని అప్పట్లో పుకార్లు షికార్లు కొట్టాయి. కానీ ఆమె మరణానికి కారణం.. ఉప్పు తక్కువగా తినడం అని తన భర్త బోనీకపూర్ తెలిపారు. ఉప్పు తక్కువగా తినడం అంత డేంజరా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి మరణించారు. అయితే ఆమె మృతిపై అనేక వార్తలు వచ్చాయి. నిర్మాత బోనీ కపూర్ తన భార్య శ్రీదేవి విషాద మరణం గురించి ఎట్టకేలకు నోరు విప్పారు. ఇది సాధారణమా, అసాధారణమా అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. 54 ఏళ్ల శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేవారని బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ ఫిగర్‌ని నిలబెట్టుకునేందుకు కడుపు మాడ్చుకుంటూ ఉప్పు లేని ఆహారం తినేదట. శ్రీదేవికి బ్లాక్‌అవుట్‌లు వచ్చేవని బోనీ కపూర్ పేర్కొన్నారు.తక్కువ రక్తపోటు కారణంగా ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవద్దని వైద్యులు శ్రీదేవికి సూచించినప్పటికీ, నటి పట్టించుకోలేదని బోనీ చెప్పారు.
శరీరానికి సరిపడా ఉప్పు అందకపోతే ఏం అవుతుంది..?
శరీరం సరిగ్గా పనిచేయడానికి కొంత మొత్తంలో సోడియం అవసరం. సోడియం శరీరం యొక్క ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కండరాలు మరియు నరాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో సోడియం సాధారణ స్థాయి 135-145 mEq/L కంటే తక్కువగా ఉన్నప్పుడు హైపోనాట్రేమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్రమైన సందర్భాల్లో, శరీరంలో తక్కువ సోడియం స్థాయిలు కండరాల తిమ్మిరి, వికారం, వాంతులు, మైకములకు కారణమవుతాయి. చివరగా, ఉప్పు లోపంతో షాక్, కోమా, మరణానికి దారితీస్తుంది. ఉప్పు ఎక్కువగా తినవద్దని వైద్యులు సూచిస్తారు. కానీ మొత్తానికి మానేయమని చెప్పడం లేదు కదా..! మీరు మీ ఆహారంలో ఉప్పును తగ్గించండి చాలు మానేయకండి. కూరల్లో కాస్త తక్కువగా ఉప్పు వేసుకోవచ్చు, దాదాపు అన్ని కూరగాయల్లో ఉప్పు ఉంటుంది, పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినొచ్చు. పెరుగులో కూడా ముందే ఉప్పు ఉంటుంది. అలవాటు చేసుకుంటే చాలు.