ఇష్టం ఉన్నా సరే నాని ఆ రెండు సినిమాలను వదులుకోవడానికి కారణం.?

-

నాచురల్ స్టార్ నాని ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేత అంటే తన నటనతో కామెడీ టైమింగ్ తో, ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తూ ఉంటాడు నాని..నాని చివరిగా అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం నిరాశని మిగిల్చింది. అయితే నాని ఒక ఇంటర్వ్యూలో గతంలో పాల్గొనడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు.

నారీ కెరియర్ లో తనకు ఇష్టమైన కొన్ని సినిమాలను చేయలేకపోయాను అని తెలియజేశాడు అందులో ముఖ్యంగా రాజారాణి, f-2 సినిమా తన చేజేతులారా మిస్ చేసుకున్నట్లుగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. మొదట రాజా రాణి కథ ని తనకి జెమిని టీవీ ఆఫీసులో కథ వినిపించారని ఆ సమయంలో తను ఎటో వెళ్లిపోయింది మనసు అనే చిత్రంలో నటిస్తూ ఉన్నానని.. ఆ తర్వాత మళ్లీ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అందుచేతనే తన డేట్స్ అడ్జస్ట్ కాక రాజా రాణి సినిమానీ వదులుకోవలసి వచ్చిందని తెలియజేశారు.

ఇక ఆ తర్వాత మరొక సినిమా ఎఫ్-2 ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దిల్ రాజు ఇద్దరు తనని సంప్రదించారు అయితే అప్పట్లో కూడా బిజీ షెడ్యూల్ ఉన్నందువల్ల ఆ సినిమాలో నటించలేకపోయాను అని తెలియజేశారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలను నాని వదులుకోవడం తనకు చాలా బాధగా అనిపించింది అని ఆ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

హీరో నాని ఒకవేళ ఈ సినిమాలలో నటించి ఉంటే తన కెరీర్ కు మరింత ప్లస్ అయ్యేదని ఆయన అభిమానుల సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం నాని దసరా అనే సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news