నాని ‘సరిపోదా శనివారం’ టీజర్ వచ్చేసింది

-

టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ.. చాలా బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్   హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే మంచి వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది.

ఈ టీజర్ ప్రారంభంలోనే  జనాలు పరిగెత్తుతూ కనిపిస్తారు. ఎస్జే. సూర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మ్యూజిక్ జనాలను భయపెడుతుంది. పోలీస్ గా ఉన్న సూర్య జనాలను కొడుతూ, హింసిస్తూ కనిపిస్తాడు. అప్పుడే నాని, హీరోయిన్ ఎంట్రీ తో ఇస్తాడు. అక్కడ భారీ ఫైట్ జరుగుతుందని బ్యాగ్రౌండ్ చూస్తే తెలుస్తుంది. అప్పుడు నాని హ్యాపీ బర్త్ డే సార్ అని చెబుతాడు. ఇవాళ ఎస్.జె. సూర్య బర్త్ డే సందర్భంగా  సూర్య కు హ్యాపీ బర్త్ డే అని చెబుతూ టీజర్ ను ఎండ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే భారీ ఫైట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ టీజర్ లో నాట్ ఏ టీజర్ కనిపించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news