వర్షాకాలంలో భయంకర వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..

-

వర్షాకాలంలో భయంకరమైన జబ్బులు రావడం చాలా కామన్. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే వీటిని చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. తులసి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేగాకుండా తులసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆయుర్వేదిక్ రీసెర్చ్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, తులసి అంటువ్యాధులతో పోరాడటానికి ఎంతగానో సహాయపడుతుంది. నల్ల మిరియాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని చాలా ఈజీగా పెంచుతాయి. ఇవి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి.

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం, నల్ల మిరియాలు జీర్ణక్రియ ప్రేగుల ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి. తేనె అనేది సహజమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. అంతేగాక ఆరోగ్యానికి మేలు చేసే ఈ తేనెలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి.

ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ బయోమెడిసిన్‌లో జరిపిన ఒక అధ్యయనంలో కనుగొన్న విషయాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే తేనె వివిధ వ్యాధికారక కారకాల పెరుగుదలను నిరోధించగలదని తేలింది.అందుకే గొంతునొప్పి, దగ్గుతో బాధపడేవారికి తేనె నిజంగా ఒక వరం లాంటిది.

జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాక్టీస్‌లోని పరిశోధన ప్రకారం, తేనె దగ్గును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది పిల్లలలో నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. తులసి ఆకులు, నల్లమిరియాలు ఇంకా తేనె కలిపి ఔషధ మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ కలయిక జలుబు ఇంకా దగ్గు లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాసకోశంలో చికాకును తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

నల్ల మిరియాలు, తేనె యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా, బ్రోన్కైటిస్ లక్షణాలను నిర్వహించడంలో ఎంతగానో సహాయపడతాయి.తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. ముందుగా 5 తులసి ఆకులను తీసుకోని, చిటికెడు నల్ల మిరియాల పొడిని కలపి దీనికి ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి పేస్ట్‌ను రెడీ చేయండి.

ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి ఖాళీ కడుపుతో తింటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ వాతావరణ మార్పు వల్ల వచ్చే దగ్గు, తుమ్ము, గొంతునొప్పి, జలుబు వంటి అన్ని సమస్యలను కూడా ఈజీగా ఇది నయం చేస్తుంది. ఇంకా భయంకరమైన సీజనల్ వ్యాధులు మీ దగ్గరకి రాకుండా ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో భయంకర వ్యాధులు మీ దరి చేరకుండా ఈ టిప్స్ పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news