‘ ది వారియర్ ‘ మూవీ రివ్యూ: రామ్ ఖాతాలో హిట్ పడినట్లేనా?.. పబ్లిక్ టాక్ ఇదే..

-

సినిమా: ది వారియర్
నటీనటులు : రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు
దర్శకత్వం : ఎన్ లింగుస్వామి
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
ఎడిటర్ : నవీన్ నూలి
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీప్రసాద్
రిలీజ్ డేట్ : 14 జులై 2022
విడుదలయ్యే భాషలు : తెలుగు, తమిళం
రన్నింగ్ టైమ్ : 155 నిమిషాలు

తొలిసారిగా లింగుస్వామి డైరెక్ట్ తెలుగు మూవీ తీశాడు. అదే ది వారియర్. ఉస్తాద్ రామ్ పోతినేని ఈ సినిమాలో హీరో. పోలీస్ ఆఫీసర్ పాత్రలో తొలిసారి రామ్ కనిపించనున్నాడు. రామ్ సరసన హీరోయిన్ కృతి శెట్టి నటించింది. తను రేడియో జాకీ పాత్రను పోషించింది. ఇప్పటికే మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తో తనేంటో నిరూపించుకున్నాడు రామ్. మళ్లీ అదే మాస్ అండ్ యాక్షన్ జానర్ లో ది వారియర్ అంటూ ఇంకాసేపట్లో థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను జులై 14న విడుదల అయ్యిండు.. మరి సినిమా టాక్ ఎలా ఉంది.. పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

కథ, విశ్లేషణ:

రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను రామ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లో విడుదల అయ్యింది. హీరో రామ్ డబుల్ యాక్షన్ లో కనిపించబోతున్నారు అనే టాక్ వచ్చింది. ఎందుకంటే ట్రైలర్లో రామ్ పోతినేని ఒకవైపు సత్య అనే పోలీస్ పాత్రలు విలన్స్ ను కొడుతూనే మెడికల్ గా డాక్టర్ తరహాలో మందులు కూడా ఇచ్చే విధంగా డైలాగ్స్ చెప్పాడు..సినిమా ఫస్టాఫ్‌ సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూ సూపర్‌ గా ఉంటుందట. మొదటి భాగం సూపర్‌ హిట్ అంటున్నారు. ఇక సెకండాఫ్‌ మాత్రం ఊరమాస్‌ గా సాగుతుందని, యాక్షన్‌ ఎపిసోడ్‌లు పూనకాలు తెప్పించేలా ఉంటాయట. రామ్‌ అభిమానులకు మంచి కనువిందు చేస్తుంది..ఇక సెకండ్ ఆఫ్ విషయాన్నికొస్తే.. కామెడీ,లవ్, రొమాన్స్, విలన్ తో భారీ ఫైట్ సీన్స్ ఉంటాయి.రామ్‌, ఆది పినిశెట్టిల మధ్య వచ్చే ఫైట్‌ సీన్లు, హొరాహొరీగా పోరాడే సన్నివేశాలు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయని, వారి మధ్య వచ్చే సవాళ్లు హైలైట్‌గా నిలుస్తాయని టాక్..డ్తెరెక్టర్ అనుకున్న కథను చక్కగా చూపించారు..అన్నీ ఎమోషన్స్ ను చక్కగా చూపించారు. రామ్ ఎనెర్జీని రెట్టింపు చేసె విధంగా సినిమాను చిత్రీకరించారు.హీరోయిన్ కూడా హీరోకు సమానంగా నటించింది..

ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. విలన్ పాత్రలో ఆది రికార్డులను బ్రేక్ చేశాడు..ఈ చిత్రం లో నటించిన వారంతా వారి పాత్రకు న్యాయం చేశారు..ముఖ్యంగా నదియా పాత్ర సినిమాకు హైలెట్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాయి..దేవిశ్రీప్రసాద్ మార్కును సినిమాలో చూపించారు.బుల్లెట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఓవర్ ఆల్ గా చూస్తే..సినిమా బాగుంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా చక్కగా ప్రజెంట్ చేశారు..రామ్ ఖాతాలో హిట్ పడిందనే టాక్ వినిపిస్తోంది..మరి కలెక్షన్ల సునామి ఎలా ఉందో సాయంత్రం తెలియనుంది.

రేటింగ్: 3.5/5

 

Read more RELATED
Recommended to you

Latest news