అలర్ట్: రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద

-

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులో వరదతో పొటెత్తుతున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరద చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 18,52,390 క్యూసెక్కులు ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వరద ఉధృతి నేపథ్యంలో 85 గేట్లు తెరిచినట్లు ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

- Advertisement -
కాళేశ్వరం ప్రాజెక్ట్
కాళేశ్వరం ప్రాజెక్ట్

అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహంతో వెంకటాపురం, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లోని 30 గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...