ఆస్కార్ బరిలో నిలిచిన ఇండియన్ మూవీస్ ఇవే..!

-

ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న వేడుక ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం. మార్చి 12వ తేదీన లాస్ ఏంజెల్స్ నగరంలో డల్బి థియేటర్లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు పొందడం కోసం యావత్తు ప్రపంచ దేశాలకు చెందిన సినిమాలు పోటీ పడుతుంటాయి. ఇప్పుడు భారత్ నుంచి కూడా చాలా సినిమాలు ఆస్కార్ బరిలోకి దిగాయి. మరి భారత్ నుంచి ఏకంగా 10 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. అయితే ఆ జాబితాను తాజాగా ఆస్కార్ కమిటీ కూడా ప్రకటించింది.

ఇకపోతే ఆ జాబితాలో నిలిచిన భారతీయ సినిమాల విషయానికి వస్తే.. 1). చల్లో షో ( గుజరాతి) 2). ఆర్ ఆర్ ఆర్ (తెలుగు), 3. కాశ్మీర్ ఫైల్స్ (హిందీ) , 4. గంగు భాయ్ కథియావాడి (హిందీ), 5.విక్రాంత్ రోణ (కన్నడ) , 6. మి వసంత రావ్ (మరాఠీ), 7. తూజ్య సాధి కహీ హై ( మరాఠీ) 8. రాకెట్రీ (తమిళ్) , 9. ఇరవిన్ నిళల్ (తమిళ్). 10. కాంతారా (కన్నడ). ఇవి కాక వివిధ దేశాలకు చెందిన మరో 301 సినిమాలు ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్నాయని ఆస్కార్ కమిటీ తెలియజేసింది.

ఈ 311 సినిమాలలో నుంచి 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన చిత్రాలను ఈనెల 24వ తేదీన ప్రకటిస్తారు. ఇకపోతే ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా అనేక విభాగాలలో పోటీ పడబోతోంది. మరోవైపు కాంతారా సినిమా కూడా ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడు విభాగాలలో షార్ట్ లిస్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news