ర‌ష్మికని పెళ్లాడాలంటే ఇవి పాటించాల‌ట‌!

టాలీవుడ్‌లో వున్న హీరోయిన్‌ల‌లో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ట‌క్కున వినిపించే పేరు ర‌ష్మిక మంద‌న్న‌. కేవ‌లం రెండే రెండు చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ఆమె న‌టించిన ఛ‌లో.., గీత గోవిందం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. దీంతో అమ్మ‌డిపై ఎంటైర్ టాలీవుడ్ చూపు ప‌డింది. క్రేజీ ఆఫ‌ర్‌ల‌తో ఆమె వెంట‌ప‌డ‌టం మొద‌లైంది.

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వడంతో ర‌ష్మిక స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరగ‌డం మొద‌లైంది. ఇన్‌స్టాలో ఆమెని ఫాలో చేసే వారి సంక్ష ఒక్క‌సారిగా రికార్డు స్థాయికి చేరింది. ఇంత క్రేజ్ వున్న హీరోయిన్‌ని పెళ్లాడాల‌ని ఓ అభిమానికి చిలిపి కోరిక క‌లిగింది. వెంట‌నే ర‌ష్మిక‌ని పెళ్లాడాలంటే ఏం చేయాల‌ని స్వ‌యంగా ర‌ష్మ‌క‌నే అడిగేశాడు. దీంతో షాక్‌కు గురికాకుండా ఈ క‌న్న‌డ సోయ‌గం కూల్‌గా ఏం స‌మాధానం చెప్పిందో తాజాగా బ‌య‌ట‌పెట్టంది.

న‌న్ను పెళ్లిచేసుకోవాల‌ని ఓ వ్య‌క్తి న‌న్ను అడిగాడు. ఫ‌స్ట్ న‌న్ను వ‌చ్చి క‌ల‌వాలి. ఇద్ద‌రం కూర్చుని మ‌ట్లాడుకుందాం. ప్రొసీజ‌ర్ ఏంటో నేను అప్పుడు చెబుతాను. న‌న్ను ఎలా క‌ల‌వాలో నా టీమ్‌ని అడ‌గండి. వాళ్ల‌కు మెసేజ్ చేయండి` అని స‌మాధానం చెప్పింది. అయితే ఆమె మాట‌లు విన్న వాళ్లంతా ర‌ష్మిక‌పై ప్ర‌శఃస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. డెమీగాడ్‌లా ఫీల‌వ్వ‌కుండా ఓ  సాధార‌ణ అమ్మాయిలా ర‌ష్మిక మాట్లాడిన తీరు ముచ్చ‌టేసింద‌ని అంతా ఆమెని అభినందిస్తున్నారు