డబ్బును ఇన్వస్ట్ చేయాలి. కానీ ఎక్కడైతే లాభం ఉంటుందో.. అక్కడ చేస్తేనే బెనిఫిట్స్ ఉంటాయి. రిస్క్ లేకుండా మంచి రాబడి వచ్చే పొదుపు స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి డబ్బులు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. ఇది పోస్టాఫీస్‌లో, బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది వరకు ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షల మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఈ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచింది. పెరిగిన లిమిట్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటును కూడా పెంచింది. దీంతో 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు 8.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కూడా ఇదే వడ్డీ లభిస్తోంది.
ఈ పథకంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు చేరొచ్చు. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. ఈ పథకంలో భార్యాభర్తలు పెట్టుబడి పెట్టడం ద్వారా గరిష్టంగా నెలకు రూ.41,000 వరకు తమ అకౌంట్‌లోకి పొందొచ్చు. ఉదాహరణకు ఈ పథకంలో ఒకరు రూ.30 లక్షలు పొదుపు చేయొచ్చు.. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రూ.60 లక్షలు జమ చేస్తే.. వారికి ప్రతీ ఏటా రూ.4,92,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.41,000 వడ్డీ వస్తుంది. అంటే రోజుకు రూ.1366 లభిస్తాయి.
రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల కాలంలో రూ. 12.3 లక్షల వడ్డీ వస్తుంది. అంటే ఏడాదికి రూ. 2.46 లక్షలు వస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్‌లో జమ అవుతాయి. అంటే మూడు నెలలకు ఒకసారి రూ. 61,500 వస్తాయి. అదే మరో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మరో రూ. 61,500 వస్తాయి. అంటే ఇద్దరి పేరుపై రూ.30 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. మూడు నెలలకు ఒకసారి రూ.1,23,000 వస్తాయి. ఇది నెలకు రూ.41 వేలుగా, రోజుకు రూ. 1366 అవుతుందనమాట.!