“సర్కారు వారి పాట” ఒక్క లుక్ తోనే మోత మోగిస్తోంది ..ఈ రికార్డ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ..!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరి సినిమాల తో వరుసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. ప్రస్తుతం సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నట్టు రీసెంట్ గా కన్‌ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు.

 

ఇక మహేష్ గెటప్ ఎలా ఉండబోతుందో క్లూ ఇస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ‘సర్కారు వారి పాట’ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ 27వ సినిమా అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేసి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ కి ఒక్క ఫస్ట్ లుక్ తోనే ఇంతక ముందు ఎప్పుడు ఏ సినిమాకి రాని విధంగా క్రేజ్ వచ్చింది.

అంతేకాదు టాలీవుడ్ లో ప్రస్తుతం టైటిల్స్ లో ట్రెండ్ పరంగా “సర్కారు వారి పాట” కొత్త రికార్డులు క్రియోట్ చేసింది. ఒక సినిమా రిలీజయ్యాక ఎంతటి క్రేజ్ వస్తుందో అంతటి క్రేజ్ ఒక్క ప్రీ లుక్ తో రావడం ఇదే మొదటిసారి. లుక్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టైటిల్ పై ఉన్న 3.5 మిలియన్ ట్వీట్ల రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు సృష్టించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” టైటిల్.. 24 గంటల్లో 4.4 మిలియన్ల ట్వీట్లను సొంతం చేసుకుని టాప్ ప్లేస్ లో నిలబడింది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు థమన్ ల కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీటవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news