సంక్రాంతి బ‌రిలో ఆ మూవీస్ క‌ష్ట‌మే!

-

ఏడు నెల‌లుగా సినిమా షూటింగ్ లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా థియేట‌ర్లు కూడా మూత‌ప‌డ్డాయి. తిరిగి ఈ నెల 15న రీఓపెన్ అవుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర కొత్త‌గా మార్గ‌ద‌ర్శ‌కాల‌ని విడుద‌ల చేసింది. అయితే వెంట‌నే కొత్త చిత్రాలు రిలీజ్ అయ్యే అవ‌కాశం లేక‌పోవ‌డంతో పాత చిత్రాల‌నే థియేట‌ర్స్ యామాన్యం ర‌న్ చేయ‌బోతోంది. ఇదిలా వుంటే కొత్త చిత్రాల హంగామా సంక్రాంతికి మొద‌ల‌వుబోతోంది.

తెలుగు సినిమాకు సంక్రాంతి మెయిన్ సీజ‌న్ అన్న‌ది తెలిసిందే. ఈ ఫెస్టివ‌ల్‌కి త‌మ చిత్రాన్ని బ‌రిలో దించాల‌ని స్టార్ హీరోల‌తో పాటు స్టార్ డైరెక్ట‌ర్స్ పోటీప‌డుతుంటారు. బిజినెస్ కూడా భారీగా జ‌రిగుతుంది కాబ‌ట్టి ఈ పండ‌గ‌ని అంతా ప్ర‌ధాన టార్గెట్‌గా పెంట్టుకుంటుంటారు. ఈ ఏడాది కూడా భారీ చిత్రాలు పోటీకి దిగ‌బోతున్నాయి. ముందుగా ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌`, య‌ష్ `కేజీఎఫ్ 2` పోటీప‌డ‌బోతున్నాయి. ఇక ఈ సినిమాల‌తో పాటు మ‌రికొన్ని ద్వితీయ శ్రేణి చిత్రాలు బ‌రిలో దిగుతున్న‌ట్టు తెలిసింది.

బాల‌య్య బోయ‌పాటి చిత్రం, అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్‌`, గోపీచంద్ `సీటీమార్‌`. నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` చిత్రాలు కూడా సంక్రాంతి రేసులో దిగుతున్నాయి. ఈ మూవీస్‌తో పాటు భారీ చిత్రాలైన `రాధేశ్యామ్‌`, చిరంజీవి `ఆచార్య‌` , బ‌న్నీ `పుష్ప‌` పోలీప‌డాల‌నుకున్నాయి. కానీ క‌రోనా కార‌ణంగా అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డంతో పోటీ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. `రాధేశ్యామ్‌` డిసెంబ‌ర్‌లోపు పూర్త‌యినా గ్రాఫిక్స్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి వుంటుంది. దాంతో `రాధేశ్యామ్‌` కూడా సంక్రాంతికి బ‌రి నుంచి త‌ప్పుకుంద‌ని తెలిసింది. అంటే ఈ సంక్రాంతికి భారీ చిత్రాలు వ‌కీల్ సాబ్‌, కేజీఎఫ్ 2 త‌ప్ప మ‌రెవీ పోటీకి  దిగ‌డం లేద‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news