ఇంటి నుంచే ఎస్‌బీఐ బ్యాంకు సర్వీసులు యాక్టివేట్ చేసుకోండిలా..!

-

ప్రముఖ దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో వినియోగదారులు తమ సర్వీసులను బ్యాంకుకు వచ్చి నిర్వహించడం లేదు. దీంతో ఎస్‌బీఐ పలు సర్వీసులను ఇంట్లోనే ఉండి యాక్టివేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఖాతా ఉందా.. అయితే మీరు బ్యాంక్ ఆన్‌లైన్ సర్వీసులు గురించి తెలుసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్‌బీఐ సర్వీసులు ఇంట్లో నుంచే పొందొచ్చు. అయితే కొంత మందికి నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు.

sbi
sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెట్ బ్యాంకింగ్ సదుపాయం పొందాలని అనుకునే వినియోగదారులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. బ్యాంకుకు వెళ్లి సులభంగానే నెట్ బ్యాంకింగ్ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లేందుకు భయపడే వినియోగదారులు కూడా ఇంట్లో నుంచే నెట్ బ్యాంకింగ్ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవచ్చని బ్యాంక్ వెల్లడించింది.

నెట్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వినియోగదారులు ఎస్‌బీఐ వెబ్ సైట్ : onlinesbi.com కి లాగిన్ అవ్వాలి. మీరు నెట్ బ్యాంకింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగానే మీ వద్ద ఏటీఎం కార్డు ఉండేలా చూసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్, సీఐఎఫ్ నెంబర్, బ్రాంచ్ కోడ్ వంటి సమాచారం దగ్గరగానే ఉంచుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కచ్ఛితంగా దగ్గర పెట్టుకోవాలి.

వినియోగదారులు ఎస్‌బీఐ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసుకోవాలి. అందులో పర్సనల్ బ్యాంకింగ్ సెక్షన్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. హోమ్ పేజ్‌లో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్/యాక్టివేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అకౌంట్ నంబర్, సీఐఎఫ్ నంబర్, బ్రాంచ్ కోడ్ వంటివి ఎంటర్ చేయాలి. ఈ తర్వాత సబ్‌మిట్‌ చేయడంతో మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీ ఆన్ లైన్ సర్వీసులు యాక్టివేట్ అవుతాయని బ్యాంకు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news