NBK109 షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్

-

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యకాలంలో అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య తాజాగా భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హ్యాట్రిక్ హిట్ సినిమాలు సక్సెస్ సాధించిన తరువాత తన 109వ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నారు బాలకృష్ణ.


భగవంత్ కేసరి మూవీ విజయం తరువాత బాలయ్య తన తరువాత చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించనున్నారు. NBK109 మూవీ షూటింగ్ నవంబర్ 06 నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. తొలుత హైదరాబాద్ లో సిద్ధం చేసిన ఓ భారీ సెట్ లో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుందని.. ఇక ఆ తరువాత చిత్ర యూనిట్ ఊటీకి వెళ్తుందని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news