బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే 3 గంటల కరెంట్ : మంత్రి హరీశ్ రావు

-

అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుస సభల్లో పాల్గొంటూ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు ఆదిలాబాద్ ఉట్నూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి నిప్పులు చెరిగారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని.. కాంగ్రెస్ కే ఓటు వేస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే అని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగం అవుతుంది. కాంగ్రెస్ కి ఓటు వస్తే మూడు గంటల త్రీ పేస్ కరెంట్ ఇస్తది. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే 24 గంటల కరెంట్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీతోనే రైతులు అభివృద్ధి పథంలో ఉన్నారు. బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్ ధర పెరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. కళ్యాణ లక్ష్మి ఆర్థిక సహాయంతో పేద ఇంటి కుటుంబానికి బీఆర్ఎస్ ఆసరాగా ఉందని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news