Adipurush : ఆదిపురుష్ టీజర్ లో బిగ్ ట్విస్ట్..కాస్త ముందుగానే రిలీజ్

-

టాలీవుడ్‌ స్టార్‌, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసు కువెళుతున్నాడు.. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు‌. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నారు. ఆ పాత్ర పేరుని లంకేష్ అని ప్రకటించారు కూడా. లంకేష్ పాత్రలో కనిపించనున్నారు సైఫ్ ఆలీ ఖాన్. తాజాగా ఆదిపురుష్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

ఈ సినిమా టీజర్‌ ను ఇవాళ సాయంత్రం 7 గంటలకే రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ముందుగా.. 7.11 గంటలకు రిలీజ్‌ చేస్తామని మొన్న చెప్పిన చిత్ర బృందం… తాజాగా ఆ టైం ను 7 గంటలకే ఫిక్స్‌ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news