ఆ ఛానెల్ ఓవ‌ర్‌యాక్ష‌న్‌పై టాలీవుడ్ గుస్సా..!

-

సినిమా రంగంలో ఏ విషయాన్ని అయినా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా లీక్ అయితే రాజమౌళి అసలు సహించడు. తాను ఏ టైంకు.. ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ఆయన నోటి వెంట బయటకు వచ్చేంత వరకు రాజమౌళి సినిమాకు సంబంధించి కూడా చిన్న న్యూస్ కూడా బ‌య‌టకు రాదు. ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయన షూటింగ్ స్పాట్ లో కి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు గేటు బయట ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది.

అయితే తాజాగా టాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ చాలా ఓవర్ ఉత్సాహం చూపిస్తుంద‌న్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత‌కు ఆ ఛానెల్‌ ఏంటో కాదు జెమినీ టీవీ ఛానల్. సినియా యూనిట్ల నుంచి అఫీషియ‌ల్‌గా రాని విష‌యాల‌నే బ‌య‌ట‌కు లీక్ చేస్తుండ‌డంతో ఇప్పుడు ఆ ఛానెల్‌పై నిర్మాత‌ల‌తో పాటు ఆయా హీరోల అభిమానులు కూడా గుస్సా అవుతున్నారు.

 

ఉదాహరణకు బాలయ్య సినిమానే తీసుకుందాం. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని చెప్పుకుంటే తప్పులేదు. అయితే ఆ సినిమా టైటిల్ రూల‌ర్ అని ప్ర‌క‌టించేసింది. దీనిపై సినిమా మేక‌ర్స్‌తో పాటు బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్ అవ్వ‌డంతో ఆ ట్వీట్ ను తొలిగించింది సదరు ఛానెల్.

కొద్ది రోజుల క్రిత‌మే నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య ఓ సినిమా చేయాల‌నుకున్నాడు. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారనే విషయం మాత్రం సస్పెన్స్. ఈ విషయాన్ని గ్రాండ్ గా ప్రకటిద్దామని యూనిట్ భావిస్తుంటే.. జెమినీ టీవీ మాత్రం పుసుక్కున ప్రకటించేసి హైప్ ను నీరుగార్చేసింది. కీల‌క విష‌యాల్లో ఈ సినిమాకు అంత అత్యుత్సాహం ఎందుకో ? అన్న సెటైర్లు టాలీవుడ్ నుంచే ప‌డుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news