బరువు పెరగాలా..? వీటిని తినండి..!

-

ఏంటీ.. ఎప్పుడు చూసినా బరువును తగ్గించే పదార్థాల గురించి చెబుతారు. ఇప్పుడు బరువును పెంచే ఆహారాల గురించి చెబుతున్నారు.. అని ఆశ్చర్యపోతున్నారా..? ఏమీ లేదండీ.. అధిక బరువును తగ్గించుకునే వారు ఉన్నట్లే.. బరువు పెరగాలని కోరుకునే వారు కూడా ఉంటారు కదా. అవును ఉంటారు.. అలాంటి వారి కోసమే ఈ కథనం.. మరి బరువును పెంచుకోవాలంటే ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. గుమ్మడికాయలు
బరువు పెరగాలని కోరుకునే వారు తినాల్సిన ఆహారాల్లో గుమ్మడికాయ ఒకటి. వీటిల్లో ఉండే పలు సమ్మేళనాలు బరువును పెంచుతాయి. మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ సమయంలో గుమ్మడికాయతో చేసిన వంటకాలను తరచూ తింటుంటే అధికంగా బరువు పెరగవచ్చు.

2. ఆలుగడ్డలు
వీటిల్లో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ ఆలుగడ్డలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలా త్వరగా, సులభంగా బరువు పెరగవచ్చు. చిప్స్, ఫ్రై, కూరలు చేసుకుని తింటే ఉపయోగం ఉంటుంది.

3. బీట్‌రూట్
కేవలం రక్తాన్ని పెంచే పోషకాలు మాత్రమే కాదు, బరువును పెంచే పోషకాలు కూడా బీట్‌రూట్‌లో ఉంటాయి. నిత్యం బీట్‌రూట్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అధికంగా బరువు పెరగవచ్చు.

4. మొక్కజొన్న
వీటిల్లోనూ పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. నిత్యం మొక్కజొన్నను ఏదో ఒక విధంగా ఆహారంలో తీసుకుంటే చాలు.. త్వరగా బరువు పెరుగుతారు.

5. పచ్చి బఠానీలు
వీటిని తరచూ మనం పలు కూరల్లో, వంటకాల్లో వేస్తుంటాం. అయితే నిత్యం పచ్చి బఠానీలను ఉడకబెట్టుకుని తింటుంటే బరువు పెరుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news