బోయ‌పాటి ప‌నైపోయిందా..!

-

టాలీవుడ్‌లో మాస్ సినిమాలు తీయ‌డంలో బోయ‌పాటి మంచి దిట్ట‌. హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డంలో, హీరోతో రౌద్ర ర‌సం పండించ‌డంలో బోయ‌పాటికి మంచి ప‌ట్టు ఉంది. త‌ల‌లు న‌ర‌క‌డం, కొడుతుంటే గోడ‌లు ప‌గిలిపోతుండ‌డం.. ఇలా భ‌యంక‌ర ర‌క్త‌పాతం మ‌నం బోయ‌పాటి సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. ప‌గ‌లు, ప్ర‌తీకారాలు, ఎమోష‌న్లు కూడా బోయ‌పాటి సినిమాల్లో ఉంటాయి. అయితే ఎప్పుడూ అదే ఫార్ములాని అటూ ఇటూ మార్చి తీసే బోయ‌పాటికి ప్ర‌స్తుతం ఛాన్సులు ఇచ్చే వాళ్లే లేరు.

టాలీవుడ్ ద‌ర్శ‌కులు కొత్త క‌థ‌లు తీసుకుని హిట్లు కొడుతుంటే బోయ‌పాటి మాత్రం ఇంకా అదే మాస్‌, పాత క‌థ‌లు తీసుకుని హిట్లు కొడుతున్నాడు. ఆయ‌న తాజా డిజాస్ట‌ర్ విన‌య విధేయ రామను తిర‌స్క‌రించ‌డానికి  కార‌ణం బోయపాటి అదే మూస ధోరణిలో వెళ్లడంతో ప్రేక్షకులు తిరస్కరించారని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. ప్ర‌స్తుతం కాలం మారుతోంది.

యువ ద‌ర్శ‌కులు తెర‌పై ఎన్నో కొత్త కథలు కథకులు ఆవిష్కరిస్తున్నారు. ఆధునికంలో టెక్నికల్ వండర్స్ ను కథలుగా మలుస్తున్నారు. చ‌రిత్ర‌లో హీరోలుగా ఉన్న వారితో సైరా, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు వ‌స్తున్నాయి. కానీ బోయ‌పాటి భ‌ద్ర నుంచి విన‌య విధేయ రామ వ‌ర‌కు ఒక‌టే అరిగిపోయి మూస ఫార్ములాతో సినిమాలు తీస్తున్నాడు.

దీంతో బోయ‌పాటి సినిమాలు అంటే ఒక వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కే అన్న ముద్ర కూడా ప‌డిపోయింది. ఇంకా బోయ‌పాటి అలాగే ముందుకు వెళ‌తానంటే ఆయ‌న కెరీర్ ప‌రంగా వెనక్కి వెళ్లడం ఖాయమని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. కొత్తదనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. మ‌రి బోయ‌పాటి మార‌తాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version