భారతీయ సినిమాను శాసిస్తున్న టాలీవుడ్..!

-

100 ఏళ్లు కలిగిన భారతీయ సినిమాకు దిశా నిర్ధేశంగా తెలుగు సినిమా పరిశ్రమ అయ్యిందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అనేట్టు ఉన్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలే సినిమాలు సౌత్ లో అంతా రొటీన్ సినిమాలే అన్న టాక్ ఉండేది. కాని సీన్ మారింది బాలీవుడ్ మేకర్స్ ను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తేలా మన తెలుగు సినిమాలు వస్తున్నాయి. అందుకే ఇక్కడ నుండి అక్కడకు వెళ్తున్న సినిమాలు ఎక్కువయ్యాయి.

అంతకుముందు సౌత్ సినిమాలంటే బాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఓ చిన్నచూపు ఉండేది కాని ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు సినిమాల దాటికి తట్టుకునేలా బాలీవుడ్ మేకర్స్ కొత్త సినిమాలు చేస్తున్నారు. మేకింగ్ పరంగా బాలీవుడ్ ఇప్పటికి అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నా కొత్త కథలు.. కథనాలతో తెలుగు పరిశ్రమ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది.

బాహుబలి తర్వాత తెలుగు పరిశ్రమ ఇంకాస్త పెద్దదిగా మారింది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకు రాని ప్రేక్షకాదరణ.. వసూళ్ల హంగామా బాహుబలి మొదటి రెండు పార్టులకు వచ్చాయి. అందుకే ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమను తెలుగు సిని పరిశ్రమ శాసిస్తుందని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news