జనసేన ఐదో జాబితా… తెలంగాణలో మరో ఎంపీ అభ్యర్థి ప్రకటన..!

ఏపీతో పాటు తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తోంది. తెలంగాణలోని కొన్ని కీలక స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను నెమ్మదిగా బరిలోకి దింపుతోంది జనసేన..

ఏపీలో ఎన్నికల నామినేషన్లకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన తమ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాయి. ఒక్కొక్కరిగా అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే టీడీపీ, వైఎస్సార్సీపీ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… జనసేన పార్టీ కూడా తమ అభ్యర్థుల లిస్ట్ ను విడుతల వారీగా ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 90 అసెంబ్లీ స్థానాలకు పవన్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి ఐదో జాబితాను ప్రకటించారు. అందులో తెలంగాణ నుంచి మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు.

తెలంగాణలోని మహబూబాబాద్ స్థానానికి తమ అభ్యర్థిని ప్రకటించగా… ఏపీలో మరో 4 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు.


ఐదో జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల లిస్ట్ ఇదే..

జనసేనలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి..

అయితే.. నంద్యాల ఎంపీ సీటు సాధించిన ఎస్పీవైరెడ్డి… టీడీపీకి షాక్ ఇచ్చి జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈసందర్భంగా పవన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వైసీపీ తరుపున 2014 లో నంద్యాల ఎంపీగా విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీని వదిలి జనసేనలో చేరారు. ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరుతారని మొదట ప్రచారం జరిగినా ఆయన చివరకు జనసేన వైపు మొగ్గు చూపారు. ఆయన జనసేనలో చేరిన వెంటనే ఆయనకు పవన్ కల్యాణ్ బీఫాం అందజేశారు.