హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఎందుకు అంటే రేపు ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ఈనెల 08న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ ఎయిర్ షో 30 నిమిషాల పాటు నిర్వహించనున్నారు.
ఈ ఎయిర్ షో లో భాగంగా విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ తో పాటు పరిసన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు పోలీసులు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.